సుక్కు... సౌండ్‌ బాగుంది | Dochevaarevarura Movie Launch by director Sukumar | Sakshi
Sakshi News home page

సుక్కు... సౌండ్‌ బాగుంది

Nov 6 2022 5:38 AM | Updated on Nov 6 2022 5:38 AM

Dochevaarevarura Movie Launch by director Sukumar - Sakshi

సుకుమార్, శివ నాగేశ్వరరావు, సిరాశ్రీ

‘‘శివనాగేశ్వరరావుగారు ‘వన్స్‌ మోర్‌’ అని యూట్యూబ్‌ చానల్‌ పెట్టి, తన అనుభవాలను అబద్ధం లేకుండా చెబుతున్నారు. నేను ఆయనకు ఫ్యాన్‌’’ అన్నారు దర్శకుడు సుకుమార్‌. ప్రణవ చంద్ర, మాళవిక సతీషన్, అజయ్‌ఘోష్, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దోచేవారెవరురా’. బొడ్డు కోటేశ్వరరావు నిర్మాత.

రోహిత్‌ వర్ధన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘సుక్కు.. సుక్కు ....’ అంటూ సాగే పాటని సుకుమార్‌ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘సుక్కు.. సౌండ్‌ బాగుంది. నా పేరుతో వచ్చే ఈ పాటకు అజయ్‌ ఘోష్‌తో డాన్స్‌ చేయించాలనే ఆలోచన శివ నాగేశ్వర రావుగారికి రావడం హ్యాట్సాఫ్‌’’ అన్నారు. ఈ పాటను సిరాశ్రీ రాశారు. ‘‘సుక్కు..’ పాటని విడుదల చేయగలరా? అని సుకుమార్‌కి మెసేజ్‌ పెట్టాను.. ఓకే అని పది నిమిషాల్లోనే రిప్లయ్‌ వచ్చింది’’ అన్నారు శివ నాగేశ్వరరావు. ఈ సినిమాకి కెమెరా: ఆర్లి గణేష్, లైన్‌ ప్రొడ్యూసర్‌: శామ్‌ సన్‌.   
 

Advertisement
 
Advertisement
Advertisement