Hero Vishwak Sen's Interesting Answer to a Reporter’s Questions About the Controversy With Actor Arjun - Sakshi
Sakshi News home page

Vishwak Sen: అర్జున్‌తో వివాదం.. డబ్బులు చెల్లించారా?: విశ్వక్‌ సేన్‌ స్పందన

Mar 18 2023 6:45 PM | Updated on Mar 18 2023 6:58 PM

Dispute With Actor Arjun Have You Paid The Money Reporter Question to Vishwaksen - Sakshi

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దాస్‌ కా ధమ్కీ’. మార్చి 22న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించిన చిత్ర యూనిట్‌ ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈనేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన హీరో విశ్వక్‌ సేన్‌కు యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జాతో వివాదంపై ప్రశ్న ఎదురైంది. అర్జున్‌తో కాంట్రవర్సీ తర్వాత మీరు ఆయనకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించారనే వార్తలు వినిపించాయి.

చదవండి: ఆ హీరోయిన్‌ని బ్లాక్‌ చేసిన బన్నీ! స్క్రిన్‌ షాట్స్‌తో నటి ఆరోపణలు..

ఇది నిజమేనా? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. దీనికి సమాధానం ఇచ్చేందుకు విశ్వక్‌ ఆసక్తి చూపలేదు. దీనిపై విశ్వక్‌ స్పందిస్తూ.. ‘అది గతం. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆ వ్యవహారానికి ఈ సినిమాకు ఎటువంటి సంబంధం లేదు. ఎంతోమందిపై ఉన్న గౌరవంతో నేను దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు’ అని బదులిచ్చాడు. కాగా విశ్వక్‌ సేన్‌ హీరోగా తన కూతురు ఐశ్వర్య హీరోయిన్‌ అర్జున్‌ ఓ చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

చదవండి: తారక్‌ వండర్‌ కిడ్‌: ఎన్టీఆర్‌పై శుభలేఖ సుధాకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ చిత్రంతో తన కూతురిని టాలీవుడ్‌ పరిచయం చేయాలనుకున్నాడు అర్జున్‌. షూటింగ్‌ కూడా మొదలు పెట్టిన అర్జున్‌ విశ్వక్‌ సేన్‌ తీరుతో ఇబ్బంది పడ్డంటు తెలిసింది. విశ్వక్‌ సరిగ్గా సెట్స్‌కు రావడం లేదని.. ఏదో ఒక కారణం చెప్పి షూటింగ్‌ రద్దు చేస్తున్నాడని.. వర్క్‌ పట్ల అతడి ప్రవర్తన బాగోలేదంటూ గతంలో అర్జున్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి ఆరోపించారు. ఆ తర్వాత కథ విషయంలో తనకి కాస్త ఇబ్బంది ఉందని, అది చెప్పినా అర్జున్‌ వినడం లేదని విశ్వక్‌ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement