Jr NTR-Subhalekha Sudhakar: సెట్లో ఎన్టీఆర్ డైలాగ్స్ చూసుకోవడం నేనెప్పుడు చూడలేదు: శుభలేక సుధాకర్‌

Subhalekha Sudhakar Interesting Comments on Jr NTR Dialogue Delivery - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. ఇక ఈ సినిమాలోని నాటు నాటు ఆస్కార్‌ రావడంతో గ్లోబల్‌ స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ఆయనతో పని చేసిన ప్రతి నటీనటులు తారక్‌ డాన్స్‌, నటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. ఎన్ని పేజీల డైలాగ్‌ అయినా సింగిల్‌ టేక్‌లో చెప్పేస్తుంటాడంటూ సర్‌ప్రైజ్‌ అవుతుంటారు. అలాగే సీనియర్‌ నటుడు శుభలేక సుధాకర్‌ కూడా తారక్‌ నటన, డైలాగ్‌ డెలివరి గురించి చెబుతూ వండర్‌ కిడ్‌ అని కొనియాడారు. ‘అరవింద సమేత’ సినిమాలో ఎన్టీఆర్‌తో ఆయన స్క్రిన్‌ షేర్‌ చేసుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: ‘రానా నాయుడు’ సిరీస్‌పై నటుడు శివకృష్ణ సంచలన వ్యాఖ్యలు

ఈ మూవీ సమయంలో ఆయన ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించిన పాత వీడియో తాజాగా వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్‌ నటన గురించి ఏం చెప్పిన తక్కువే. ఆయన ఎప్పుడు డైలాగ్‌ చదువుతాడో తెలియదు. టేక్‌ అనగానే మూడు, నాలుగు పేజీల డైలాగ్‌ అయినా సింగిల్‌ టేక్‌లో చెబుతాడు. సెట్‌లో ఎప్పుడు సరదగా ఉండే తారక్‌.. డైలాగ్‌ పేపర్‌ చూసుకోవడం నేనెప్పుడు చూడలేదు. ఆయన కెమెరా కోసమే పుట్టారనిపిస్తుంది. ఇదంతా సినిమా పట్ల ఆయనకు ఉన్న కసి, కృషి వల్లేనేమో. చెప్పాలంటే తారక్‌ వండర్‌ కిడ్‌’ అంటూ ఎన్టీఆర్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు.

చదవండి: నాటు నాటు సాంగ్‌ పెడితేనే నా కొడుకు తింటున్నాడు, అది కూడా తెలుగులోనే: కరీనా కపూర్‌ 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top