సినిమా ఏంటో పోస్టరే చెబుతోంది: వీవీ వినాయక్‌ | Director VV Vinayak Launched Punchnama Poster | Sakshi
Sakshi News home page

సినిమా ఏంటో పోస్టరే చెబుతోంది: వీవీ వినాయక్‌

Dec 23 2021 8:05 AM | Updated on Dec 23 2021 8:32 AM

Director VV Vinayak Launched Punchnama Poster - Sakshi

‘‘పంచనామ’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ చూడగానే ఒక పాజిటివ్‌ వైబ్రేషన్‌ కలుగుతోంది. ఈ సినిమాని ఎంత కసిగా చేశారో పోస్టరే చెబుతోంది. ఈ మూవీ మంచి విజయం సాధించాలి’’ అని డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ అన్నారు. త్రిపుర నిమ్మగడ్డ, వెంప కాశీ లీడ్‌ రోల్స్‌లో సిగటాపు రమేష్‌ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పంచనామ’. గద్దె శివకృష్ణ, వెలగ రాము నిర్మించారు. వెంప కాశీ పుట్టినరోజు సందర్భంగా ‘పంచనామ’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, టీజర్‌ను వీవీ వినాయక్‌ విడుదల చేశారు. ‘‘మా సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోంది’’ అన్నారు సిగటాపు రమేష్‌ నాయుడు. 


వెంప కాశీ, వినాయక్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement