ముఖ్యమంత్రిగా చరణ్‌ ప్రమాణ స్వీకారం చేస్తారా?

Director Shankars Movie With Ram Charan - Sakshi

శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘ముదల్‌వన్’ (1999) సినిమా గుర్తుందిగా! అదేనండీ.. తెలుగులో ‘ఒకేఒక్కడు’గా విడుదలైంది కదా.. ఆ సినిమానే. అందులో ఒక్కరోజు ముఖ్యమంత్రిగా అర్జున్ అదరగొట్టారు. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు హీరో రామ్‌చరణ్‌ని ముఖ్యమంత్రిని చేయనున్నారట శంకర్‌. చరణ్‌–శంకర్‌ కాంబినేషన్‌లో ‘దిల్‌’ రాజు ఓ సినిమా నిర్మించనున్న విషయం తెలిసిందే.

పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, ఇందులో రామ్‌చరణ్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి.. ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా చరణ్‌ ప్రమాణ స్వీకారం చేస్తారా? ఒకవేళ చేస్తే.. ‘అనే నేను’ అనేముందు ఏ పేరు చెబుతారో? చరణ్‌ క్యారెక్టర్‌కి శంకర్‌ ఏ పేరు పెడతారో చూడాలి.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top