వారెంట్‌ జారీ అయ్యిందని తెలిసి షాకయ్యా: దర్శకుడు శంకర్‌

director shankar gives clarity on warrant issue regarding arur tamilnadan case - Sakshi

సాక్షి, చెన్నై: చెన్నైలోని ఎగ్మోర్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో తనపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యిందని తెలిసి షాక్‌కు గురయ్యానని దర్శకుడు శంకర్ పేర్కొన్నాడు. అయితే తన లాయర్ సాయి కుమరన్ కోర్టును సంప్రదించగా తనపై ఎలాంటి వారెంట్ లేదని తెలిందని ఆయన తెలిపాడు. ఆన్ లైన్ కోర్ట్ రిపోర్టింగ్‌లో లోపం కారణంగా ఇలా జరిగిందని తెలిసి ఊపిరి పీల్చుకున్నానన్నాడు. ఆన్‌లైన్‌లో జరిగిన పొరపాటును ఇప్పుడు సరి చేశారని శంకర్ తెలిపాడు. అయితే ఈ విషయంపై ఎలాంటి అవాస్తవలను ప్రసారం చేయవద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశాడు. 

కాగా, ప్రముఖ రచయిత అరుర్‌ తమిళ్‌నందన్‌ రచించిన ‘జిగుబా’ కథను కాపీ కొట్టి ‘రోబో’ చిత్రాన్ని తెరకెక్కించాడని శంకర్‌పై చెన్నైలోని ఎగ్మోర్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో కేసు దాఖలైంది. ఇదే కేసుకు సంబంధించి శంకర్‌కు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యిందన్న వార్త ప్రచారంలో ఉన్న నేపథ్యంలో.. తాజాగా ఆయన ఓ ప్రెస్‌ నోట్‌ను విడుదల చేసి స్పష్టతనిచ్చారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top