Director Rathan Linga New Movie As Producer With New Hero, Story Deets Inside - Sakshi
Sakshi News home page

కొత్త హీరోతో సినిమా.. అలాంటి డిఫరెంట్ స్టోరీ

Aug 17 2023 5:04 PM | Updated on Aug 17 2023 6:02 PM

Director Rathan Linga New Movie As Producer - Sakshi

'అట్టు' దర్శకుడు రతన్‌ లింగా, రాజకుమార్‌, వేలుసామి కలిసి బాంబూ ట్రీస్‌ సినిమాస్‌, అల్మురియట్‌ సంస్థలపై నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెంబర్‌ 2 చిత్రం బుధవారం చైన్నె, తిరువళ్లూర్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా మన్నవరాజన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడైన రతన్‌లింగా మరో దర్శకుడికి అవకాశం ఇవ్వడం విశేషం. 

(ఇదీ చదవండి: డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కొత్త కారు.. ఎన్ని కోట్లో తెలుసా?)

మన్నవరాజన్‌ చెప్పిన కథ నచ్చడంతో ఈయనని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అర్జున్‌ అనే కుర్రాడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సెంబీ చిత్రం ఫేమ్‌ ముల్‌లై హీరోయిన్‌గా చేస్తోంది. లెనిన్‌ బాలాజీ సినిమాటోగ్రాఫర్. చిత్ర వివరాలను దర్శకుడు చెబుతూ.. 'చరిత్రలో మరుగున పడ్డ వైవిద్య జాతి గురించి చెప్పే కథా చిత్రంగా ఇది ఉంటుంది' అని అన్నారు. 

మంచి జనరంజక అంశాలతో పాటు, అవార్డులే లక్ష‍్యంగా ఈ సినిమా తీస్తున్నట్లు దర్శకుడు చెప్పుకొచ్చారు. చిత్ర కథ, కథనాలు కొత్తగా ఉంటాయన్నారు. టైటిల్‌తో పాటు మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. కాగా పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్ర షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసి తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తునట్లు నిర్మాతలు తెలిపారు.

(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో విషాదం.. సితార ఎమోషనల్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement