Director Ram Gopal Varma Interesting Comments On Kantara Movie Success, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma Tweet: చిన్న సినిమా దెబ్బకు పెద్ద రికార్డులన్నీ బ్రేక్ : ఆర్జీవీ

Oct 17 2022 3:00 PM | Updated on Oct 17 2022 9:10 PM

Director Ram Gopal Varma Tweet On Kantara Movie Success - Sakshi

ఇప్పుడు ఎవరి నోటా విన్నా వినిపిస్తున్న ఒకే ఒక్క సినిమా 'కాంతార'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం కన్నడలోనూ రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయడంతో కలెక్షన్లతో పలు పెద్ద చిత్రాల రికార్డులు బద్దలు కొడుతోంది. 

(చదవండి: కాసుల వర్షం కురిపిస్తున్న కాంతార.. మౌత్‌టాక్‌తోనే హిట్‌టాక్‌)


అయితే ఈ సినిమా సక్సెస్ పట్ల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సైతం స్పందించారు. కేవలం సూపర్ స్టార్స్, మాసివ్ ప్రొడక్షన్ వాల్యూస్, స్పెక్టాక్యులర్ వీఎఫ్‌ఎక్స్ మాత్రమే జనాలను థియేటర్లకు రప్పించగలవని ఫిల్మ్ మేకర్స్ అనుకుంటున్న తరుణంలో పేరు లేని చిన్న సినిమా పెద్ద సినిమాల రికార్డులను బద్దలు కొడుతోందని ట్వీట్ చేశారు.  ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ "గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా తెలుగులో రిలీజ్ చేశారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement