హీరోగా రాబోతున్న దర్శకేంద్రుడు.. నలుగురు హీరోయిన్లతో సందడి!

Director Raghavendra Rao To Debut As Hero In Tanikella Bharani Direction - Sakshi

దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు నటుడిగా హీరోగా మారారు. శతాధిక చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి ఎందరో హీరోలను వెండితెరకు పరిచయం చేసిన ఆయన కథానాయకుడిగా ఓ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి తనికెళ్ల భరణి దర్శకుడిగా వ్యవహరించనున్నారట. దర్శకేంద్రుడి కోసం ప్రత్యేకంగా ఆయన కథ రెడీ చేసినల్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ స్క్రిప్ట్‌ కూడా పుర్తయిందని, త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో ఆయన నలుగురు హీరోయిన్లతో సందడి చేయబోతున్నారట. దీనితో పాటు మరో చిత్రంలో కూడా ఆయన హీరో నటించబోతున్నారట.

చదవండి: Samantha: సమంత లేటెస్ట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ వైరల్‌..

వీఎన్‌ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం రాబోతున్న ఆ ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్‌ కూడా సిద్దమవుతున్నట్లు సమాచారం. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ట. అయితే ‘ఓం న‌మో వెంక‌టేశ‌’ త‌ర‌వాత రాఘ‌వేంద్ర రావు ద‌ర్శ‌కుడిగా మ‌రో సినిమా చేయ‌లేదు. దీంతో ఆయన రిటైర్‌మెంట్‌ తీసుకోబోతున్నారని అందరూ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో రాఘవేంద్రరావు హీరోగా తెరపై అలరించబోతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా ప్రస్తుతం ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి ‘పెళ్లి సందD’ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాఘవేంద్ర‌రావు వశిష్ట పాత్ర‌లో కనిపించబోతున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top