సినిమా సక్సెస్‌ అవాలంటే కథే హీరోగా ఉండాలి | Director Perarasu About Take Diversion Movie | Sakshi
Sakshi News home page

Take Diversion: సినిమా సక్సెస్‌ అవాలంటే కథే హీరోగా ఉండాలి

May 19 2022 9:24 AM | Updated on May 19 2022 9:36 AM

Director Perarasu About Take Diversion Movie - Sakshi

ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రం విజయం సాధించాలంటే కథే హీరోగా ఉండాలని పేర్కొన్నారు. ఈ చిత్ర దర్శకుడు ఇంతకుముందు ఒకే నటుడితో కార్గిల్‌ అనే చిత్రంతో కొత్త ప్రయోగం చేసి మంచి గుర్తింపు పొందారన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో వినూత్న ప్రయోగాలకెప్పుడూ మంచి ఆదరణ ఉంటుందన్నారు.

తమిళ చిత్ర పరిశ్రమలో వినూత్న ప్రయోగాలకెప్పుడూ ఆదరణ ఉంటుందని దర్శకుడు పేరరసు అన్నారు. శివాని స్టూడియోస్‌ పతాకంపై సుభా సెంథిల్‌ నిర్మించిన చిత్రం టేక్‌ డైవర్షన్‌. శివాని సెంథిల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేజీఎఫ్‌ చిత్రం ఫేమ్‌ శివకుమార్, నటి పాడినికుమార్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ మంగళవారం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రం విజయం సాధించాలంటే కథే హీరోగా ఉండాలని పేర్కొన్నారు. ఈ చిత్ర దర్శకుడు ఇంతకుముందు ఒకే నటుడితో కార్గిల్‌ అనే చిత్రంతో కొత్త ప్రయోగం చేసి మంచి గుర్తింపు పొందారన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో వినూత్న ప్రయోగాలకెప్పుడూ మంచి ఆదరణ ఉంటుందన్నారు.

చదవండి 👇

'మహేశ్‌బాబును ఇలా చూస్తామని జన్మలో అనుకోలేదు'

కాస్మొటిక్‌ సర్జరీ వెంటపడుతున్న తారలు.. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా డోంట్‌ కేర్‌!

Advertisement
 
Advertisement
Advertisement