Director Cheran Interesting Comments On Vijay Sethupathi - Sakshi
Sakshi News home page

విజయ్‌ సేతుపతితో సినిమా చేయడం సాధ్యం కాదు: డైరెక్టర్‌

Aug 7 2023 8:08 AM | Updated on Aug 7 2023 9:01 AM

Director Cheran Interesting Comments On Vijay Sethupathi - Sakshi

భారతి కన్నమ్మ, దేశీయ గీతం, వెట్రికొడిగట్టు, పాండవర్‌ భూమి, సొల్లమరంద కథా, ఆటోగ్రాఫ్‌, తవమా య్‌ తవమిరుందు వంటి పలు విజయవంతమైన తమిళ చిత్రాల దర్శకుడు, వీటిలో పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన దర్శక నటుడు చేరన్‌. అయితే ఇటీవల ఆయన నటించిన, దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలు నిరాశ పరచడంలో మళ్లీ తన సత్తా చాటే ప్రయత్నంలో ఉన్నారు.

కాగా ఆ మధ్య నటు డు విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా ఓ చిత్రం చేస్తానని ప్రకటించారు. అయితే దానికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు తెలియ రాలేదు. కాగా ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు చేరన్‌ను విజయ్‌ సేతుపతితో చేసే చిత్రం ఏమైందన్న మీడియా ప్రశ్నకు ఆ చిత్రాన్ని ఇకపై చేయటం వీలుకాదని బదులిచ్చారు. ప్రస్తుతం విజయ్‌ సేతుపతి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారని ఆయన కోసం కథను మార్చాల్సి ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా ప్రస్తుతం విజయ్‌ సేతుపతి చాలా బిజీగా ఉన్నారని, కాబట్టి ఆయనతో చిత్రం చేయడం ఇప్పట్లో అసాధ్యమని చేరన్‌ స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement