శ్రీవారిని దర్శించుకున్న నయనతార | Dil Raju Vamsi Paidipally And Nayanathara Visits Tirumala | Sakshi
Sakshi News home page

Nayanathara: శ్రీవారిని దర్శించుకున్న నయనతార

Sep 27 2021 9:43 AM | Updated on Sep 27 2021 4:39 PM

Dil Raju Vamsi Paidipally And Nayanathara Visits Tirumala - Sakshi

Nayanathara, Dil Raju, Vamsi Paidipally Visits Tirumala: హీరోయిన్‌  నయనతార తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి దర్శనంలో నయనతారతో పాటు ఆమె కాబోయే భర్త,  దర్శకుడు విజ్ఞేష్ శివన్ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు. ఆలయం వెలుపల నయనతారని చూడటానికి, పోటోలు దిగడానికి భక్తులు అభిమానులు ఉత్సహం చూపారు. వీరితో పాటు  ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి, ఆయన కుటుంబ సభ్యులు కూడా తిరుమలను సందర్శించారు. 

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వంశీ పైడిపల్లి తమిళ స్టార్ హీరో విజయ్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement