హిట్‌ అయితే నేను కూడా లక్కీయే | Dil Raju Speech At Shaadi Mubarak Pre Release Event | Sakshi
Sakshi News home page

హిట్‌ అయితే నేను కూడా లక్కీయే

Mar 5 2021 4:40 AM | Updated on Mar 5 2021 4:40 AM

Dil Raju Speech At Shaadi Mubarak Pre Release Event - Sakshi

వీర్‌ సాగర్, ‘దిల్‌’ రాజు, దృశ్యా రఘునాథ్, హేమ, పద్మశ్రీ

మొగలి రేకులు ఫేమ్‌ వీర్‌సాగర్‌ (ఆర్కే నాయుడు), దృశ్యా రఘునాథ్‌ జంటగా పద్మశ్రీ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన చిత్రం ‘షాదీ ముబారక్‌’. నేడు విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘ఓ రోజు సాగర్‌ నా దగ్గరకు వచ్చి ఈ ట్రైలర్‌ చూపించినప్పుడు బాగుందని చెప్పా. అక్కడ నుంచి కష్టాలు మొదలయ్యాయి. సినిమా చూసినప్పుడు కొన్ని కరెక్ష¯Œ ్స చెప్పడమే కాకుండా ఫైనాన్షియల్‌గా కూడా కాస్త సపోర్ట్‌ చేసి, సినిమాను పూర్తి చేశాను.

సాధారణంగా స్క్రిప్ట్‌ దగ్గర నుంచి ట్రావెల్‌ అయినప్పుడే మా బ్యానర్‌ పేరు ఇస్తారు. కానీ సినిమా బాగుందని మా బ్యానర్‌ ద్వారా రిలీజ్‌ చేస్తున్నాను. ఈ సినిమాను ప్రేక్షకులు సక్సెస్‌ చేస్తే నేను కూడా లక్కీ. పద్మశ్రీ ఇంట్రెస్టింగ్‌గా సినిమాను తీశారు. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు నవ్వుతూ వెళతారనే గ్యారంటీ ఇస్తా’’ అన్నారు. ‘‘దిల్‌’ రాజు ఎంతో సపోర్ట్‌ చేశారు’ అన్నారు పద్మశ్రీ. ‘‘దిల్‌’రాజుగారి సపోర్ట్‌ లేకపోతే  ఈ సినిమా ఇంతవరకు వచ్చేది కాదు’’ అన్నారు కో ప్రొడ్యూసర్‌ శ్రీనివాసరెడ్డి.  


అందుకే సినిమాల్లోకి వచ్చాను: వీర్‌ సాగర్‌ మాట్లాడుతూ – ‘‘సీరియల్స్‌లో నేను పెద్ద పాత్రలు పోషించాను. ఎన్ని సీరియల్స్‌ చేసినా అంత కన్నా పెద్ద పాత్రలు అయితే రావు. అందుకే సినిమాల్లోకి వచ్చాను. మొదట్లో కొత్తగా అనిపించింది. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఒక ఎన్నారై యువకుడు పెళ్లిచూపుల కోసం ఇండియా వస్తాడు. అక్కడ ఓ మ్యారేజ్‌ బ్యూరోకి చెందిన ఓ అమ్మాయిని కలుస్తాడు. వారి ప్రయాణంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే ‘షాదీ ముబారక్‌’ సినిమా కథ’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement