కొత్తదనం లేకపోతే ప్రేక్షకులు చూడరు | Dil Raju Speech At Dil Kush Song Launch | Sakshi
Sakshi News home page

కొత్తదనం లేకపోతే ప్రేక్షకులు చూడరు

May 2 2023 4:37 AM | Updated on May 2 2023 4:37 AM

Dil Raju Speech At Dil Kush Song Launch - Sakshi

కాశీ విశాల్, ‘దిల్‌’ రాజు, ఆశిష్‌

‘‘ప్రేక్షకులకు విజయవంతమైన సినిమా ఇవ్వడం అంత తేలిక కాదు. ‘బలగం, దసరా, విరూ పాక్ష’.. ఇలా కొత్తదనంతో నూతన దర్శకులు తీసిన చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాయి. కొత్తదనం లేని సినిమాలు చూడటానికి రెడీగా లేరు.. అది ఇవ్వడానికి రాత్రీపగలు కష్టపడాల్సిందే’’ అన్నారు ‘దిల్‌’ రాజు. ఆశిష్, ఇవానా జంటగా కాశీ విశాల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సెల్ఫిష్‌’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్‌ రైటింగ్స్‌పై ‘దిల్‌’ రాజు–శిరీష్‌ నిర్మిస్తున్నారు.

ఆశిష్‌ పుట్టినరోజు (మే 1)ని పురస్కరించుకుని ‘సెల్ఫిష్‌’లోని ‘దిల్‌ ఖుష్‌..’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. మిక్కీ జె. మేయర్‌ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, జావేద్‌ అలీ పాడారు. ఈ సందర్భంగా ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘నేను, సుకుమార్‌ సపోర్ట్‌గా ఉంటాం. కానీ, ప్రేక్షకులకు నచ్చాల్సింది మాత్రం ఆశిష్‌. దాని కోసం తను కష్టపడాలి’’ అన్నారు. ‘‘సెల్ఫిష్‌’ కోసం నేను, కాశీ ప్రాణం పెట్టి కష్టపడుతున్నాం’’ అన్నారు ఆశిష్‌. ‘‘మాస్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రం ఇది’’ అన్నారు విశాల్‌ కాశీ. ఈ చిత్రానికి సహనిర్మాతలు: హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అశోక్‌ బండ్రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement