‘ధీర’ట్రైలర్‌ బాగుంది.. వారి కష్టానికి ప్రతిఫలం రావాలి: దిల్‌ రాజు | Sakshi
Sakshi News home page

‘ధీర’ట్రైలర్‌ బాగుంది.. వారి కష్టానికి ప్రతిఫలం రావాలి: దిల్‌ రాజు

Published Thu, Feb 1 2024 1:13 AM

Dil Raju to release Laksh Chadalawada Dheera movie - Sakshi

‘‘25 ఏళ్ల నుంచి చదలవాడ బ్రదర్స్‌ని చూస్తున్నాం. శ్రీనివాస్‌గారు చిన్న నిర్మాతలకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్‌ చేస్తారు. ఇక లక్ష్  నటించిన ‘ధీర’ట్రైలర్‌ బాగుంది. తన హార్డ్‌ వర్క్, చిత్ర యూనిట్‌ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. లక్ష్  చదలవాడ హీరోగా విక్రాంత్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ధీర’. చదలవాడ బ్రదర్స్‌ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మించిన ఈ మూవీ రేపు (శు క్రవారం) విడుదలవుతోంది.

ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకకి ‘దిల్‌’ రాజు, దర్శకులు గోపీచంద్‌ మలినేని, త్రినాథరావు నక్కిన అతిథులుగా హాజరై, సినిమా బిగ్‌ టికెట్‌ను లాంచ్‌ చేశారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ఇన్నేళ్లలో ఎంతో మంది దర్శకులని పరిచయం చేశాను. ‘ధీర’తో విక్రాంత్‌ను పరిచయం చేస్తున్నాను. లక్ష్ ను చూసి తండ్రిగా గర్విస్తుంటాను. మా ప్రొడక్షన్‌లో ఇప్పుడు పదహారు చిత్రాలు రెడీగా ఉన్నాయి’’ అన్నారు.

‘‘పక్కోడి గురించి పట్టించుకోకుండా నచ్చింది చేసే వాడికి ఓ మిషన్‌ అప్పగిస్తే  ఆ ప్రయాణంలో ఏర్పడిన సమస్యల్ని ‘ధీర’లో చూస్తారు’’ అన్నారు లక్ష్  చదలవాడ. ‘‘ధీర’ చాలా యూనిక్‌ పాయింట్‌. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు విక్రాంత్‌ శ్రీనివాస్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement