'ఫ్యామిలీస్టార్‌' తర్వాత విజయ్‌, దిల్‌ రాజు కొత్త సినిమా | Vijay Devarakonda, Dil Raju Reunite for Action Film ‘Rowdy Janardhan’ | Sakshi
Sakshi News home page

'ఫ్యామిలీస్టార్‌' తర్వాత విజయ్‌, దిల్‌ రాజు కొత్త సినిమా

Oct 10 2025 5:03 PM | Updated on Oct 10 2025 5:16 PM

Vijay Deverakonda and dil raju will do again work for movie

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), దిల్‌ రాజు కలిసి మరోసారి పనిచేయనున్నారు. వీరిద్దరూ కలిసి ఇప్పటికే ఫ్యామిలీస్టార్‌ సినిమాను అందించారు. దర్శకుడు పరశురామ్‌ తెరకెక్కించిన ఈ చిత్రం  అనుకున్నంత రేంజ్‌లో అయితే మెప్పించలేదు. అయితే, మరోసారి విజయ్‌ దేవరకొండతో కలిసి ఒక ప్రాజెక్ట్‌ చేస్తానని నిర్మాత దిల్‌రాజు గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలోనే సరికొత్తగా యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

విజయ్ దేవరకొండ కొత్త చిత్రం అక్టోబర్ 11న ప్రారంభం కానుంది. ఈ మూవీని దర్శకుడు రవికిరణ్ కోల తెరకెక్కించనున్నారు. గతంలో రవికిరణ్‌ డైరెక్ట్‌ చేసిన ‘రాజా వారు రాణి గారు’ సినిమా క్లాసిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను మెప్పించింది.  అయితే, ఇప్పుడు యాక్షన్‌ సినిమా కోసం ఆయన పనిచేయనున్నారు. ఈ మూవీకి ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్‌ కూడా ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. అక్టోబర్‌ 16 నుంచే ముంబైలో షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు టాక్‌. SVC బ్యానర్‌లో  భారీ బడ్జెట్‌తో దిల్‌ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. 2026లో ఈ మూవీ విడుదల కానుంది. ఇందులో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ నటించనున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement