Dil Raju Announce Equal Ticket Price For Upcoming Movies, Deets Inside - Sakshi
Sakshi News home page

Dil Raju On Ticket Prices: సినీ ప్రియులకు శుభవార్త, ఇక మీదట అన్ని సినిమాలకు ఒకటే రేటు!

Jul 20 2022 3:48 PM | Updated on Jul 20 2022 4:49 PM

Dil Raju Announce Equal Ticket Price For Upcoming Movies - Sakshi

ఇక మీదట అన్ని సినిమాలకు ఒకే ధర ఉంటుందని వెల్లడించాడు. కాకపోతే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన స్టార్‌ హీరోల సినిమాలకు మాత్రం ఇందుకు మినహాయింపు అని స్పష్టం చేశాడు.

సినీప్రియులకు ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. ఇక మీదట అన్ని సినిమాలకు ఒకే ధర ఉంటుందని వెల్లడించాడు. కాకపోతే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన స్టార్‌ హీరోల సినిమాలకు మాత్రం ఇందుకు మినహాయింపు అని స్పష్టం చేశాడు.

బుధవారం నాడు జరిగిన థాంక్యూ చిత్ర ప్రెస్‌మీట్‌లో దిల్‌ రాజు మాట్లాడుతూ.. స్టార్‌ హీరోల హై బడ్జెట్‌ చిత్రాలను మినహాయిస్తే అన్ని సినిమాలకు టికెట్‌ రేట్లు ఒకేలా ఉంటాయన్నాడు. మేజర్‌, విక్రమ్‌ సినిమాలకు ఉన్న రేట్లే అన్నింటికీ ఉంటాయని తెలిపాడు. హైదరాబాద్‌, వైజాగ్‌లాంటి పట్టణాల్లో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో జీఎస్టీ కలిపి రూ.150, మల్టీప్లెక్స్‌లో రూ.200 ఉంటాయని పేర్కొన్నాడు. నిర్మాతలందరం కలిసి చర్చించాకే టికెట్‌ రేట్లపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

చదవండి: పనిమనిషి చెప్పేదాకా చైసామ్‌ విడిపోతున్నారని తెలియదు
'లైగర్‌' ట్రైలర్ లాంచ్‌.. ఆకర్షిస్తోన్న రౌడీ హీరో భారీ కటౌట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement