
నయనతారను ఆమెకు కాబోయే భర్త విఘ్నేష్ శివన్ ‘తంగమ్’ అని పిలుస్తారు. ‘తంగమ్’ అంటే బంగారం అని అర్థం. ఇప్పుడు నయనతార తన మాతృభాష మలయాళంలో చేయనున్న తాజా సినిమాకు ‘గోల్డ్’ (బంగారం) అనే టైటిల్ ఖరారైంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరో. ఇందులో నయనతారది బంగారం లాంటి క్యారెక్టర్ అట. ‘నిరమ్’ (2013), ‘ప్రేమమ్’ (2015) చిత్రాల తర్వాత అల్ఫోన్స్ పుత్రెన్ దర్శకత్వం వహించనున్న సినిమా ఇది. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఫస్ట్ షెడ్యూల్‌లోనే నయనతార ‘గోల్డ్’ సినిమా సెట్స్‌లో పాల్గొంటారని మాలీవుడ్ టాక్
చదవండి : మ్యూజిక్ స్కూల్‌లో అడ్మిషన్ తీసుకోనున్న శ్రియా సరన్
పవన్ కళ్యాణ్‌కు పవర్ స్టార్ బిరుదును ఇచ్చింది ఎవరో తెలుసా..?