Did Rakul Preet Singh Undergo Lip surgery? - Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: రకుల్‌ సర్జరీ చేయించుకుందా?

Sep 27 2021 12:51 PM | Updated on Sep 27 2021 1:53 PM

Did Rakul Preet Singh Undergo Lip surgery - Sakshi

Rakul Preet Singh Undergo Lip Surgery? హీరోయిన్‌ రకుల్‌ సర్జరీ చేయించుకున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. ఇప్పటికే ముక్కకి సర్జరీ చేయించుకున్న రకుల్‌ తాజాగా..

Rakul Preet Singh Undergo Lip Surgery?: హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె షేర్‌ చేసిన ఓ ఫోటోలో న్యూలుక్‌లో కనిపించి అందరికి షాక్‌ ఇచ్చింది. రకుల్‌ ముఖంలో మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందాన్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసం రకుల్‌ పెదాలకు సర్జరీ చేయించుకున్నట్లు టాక్‌ వినిపిస్తుంది.ఈ ఫోటోను చూసిన నెటిజన్లు అసలు ఆమె రకుల్‌ ఏనా? ఇలా తయారయ్యింది ఏంటి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.చదవండి : నామినేషన్‌ దాఖలు చేసిన ప్రకాశ్‌ రాజ్‌

ఇప్పటికే వ్యాయామంతో బక్కచిక్కి కళ తగ్గిపోయిన రకుల్‌ మరోసారి సర్జరీతో మరింత దారుణంగా మారిపోయిందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో ఈ సర్జరీ వికటించడం వల్లే రకుల్‌ పెదాలు ఇలా మారిపోయాయి అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది హీరోయిన్లు అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం కాస్మోటిక్ స‌ర్జ‌రీలు చేయించుకుంటారన్న విషయం తెలిసిందే.

గతంలో రకుల్‌ ముక్కకి కూడా సర్జరీ చేయించుకుందనే ప్రచారం ఉంది. దీంతో రకుల్‌ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా తయారైపోయింది అంటూ పలువురు ఆమె పాత ఫోటోలను పోల్చి చూస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే  రకుల్‌ ఈ మధ్య ఎక్కువగా బాలీవుడ్‌ చిత్రాల పైనే ఫోకస్‌ పెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా కొండపొలం. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. చదవండి : ఆర్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ వెంకట్‌ కన్నుమూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement