పుష్ప-2 రికార్డ్ బ్రేక్‌.. ఇంకా ఎన్ని కోట్లంటే? | Dhurandhar 2 Only Rs 5 crore away from crossing Pushpa 2 collections | Sakshi
Sakshi News home page

Dhurandhar 2 Movie: పుష్ప-2 రికార్డ్ బ్రేక్.. దురంధర్‌-2కు ఛాన్స్..!

Apr 17 2026 4:31 PM | Updated on Apr 17 2026 5:39 PM

Dhurandhar 2  Only Rs 5 crore away from crossing Pushpa 2 collections

రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్‌-2 రిలీజై నెల రోజులవుతున్నా ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. మార్చి 19న విడుదలైన దురంధర్‌-2 వసూళ్ల పరంగా ఇంకా రాణిస్తోంది. ఇప్పటికే రెండు పార్టులు కలిపి రూ.3 వేల కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రాలు ఇండియన్ సినిమా గతినే మార్చేశాయి. తాజాగా దురంధర్-2 మూవీ అరుదైన రికార్డ్‌పై కన్నేసింది.

అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన పుష్ప-2 అల్ టైమ్ వసూళ్ల రికార్డ్‌కు అతి చేరువగా వచ్చేసింది. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప ది రూల్ బాక్సాఫీస్ వద్ద రూ. 1,742.10 కోట్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ దురంధర్‌ రూ. 1,737.74 కోట్ల కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద రన్ అవుతోంది. అంటే కేవలం రూ.5 కోట్లు మాత్రమే వెనకంజలో ఉంది. ఈ మూవీ 5 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తే పుష్ప-2 రికార్డ్‌ను బ్రేక్ చేయనుంది. ఈ జాబితాలో అమిర్ ఖాన్ దంగల్, రాజమౌళి బాహుబలి-2, పుష్ప-2 వరుసగా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. వసూళ్లు ఇలాగే కొనసాగితే దురంధర్‌-2 త్వరలోనే పుష్ప-2ను వెనక్కి నెట్టనుంది.

కాగా..ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం  వహించారు. ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్‌గా కనిపించింది. ఈ మూవీలో ఆర్ మాధవన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్‌లోనే సీక్వెల్‌ రిలీజ్ చేసిన సరికొత్త రికార్డ్ సృష్టించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement