Thalapathy 67: Dhanush May Play Villain Role In Lokesh Kanagaraj And Vijay Movie - Sakshi
Sakshi News home page

లోకేష్‌ ‘మాస్టర్‌’ప్లాన్‌.. విజయ్‌ సినిమాలో విలన్‌గా స్టార్‌ హీరో!

Jun 14 2022 3:11 PM | Updated on Jun 14 2022 3:31 PM

Dhanush May Play Villain Role In Lokesh Kanagaraj And Vijay Movie - Sakshi

మల్టీస్టారర్ మూవీస్ బాక్సాఫీస్ ను రూల్ చేస్తున్నాయి. టాలీవుడ్ నుంచి వచ్చిన ఆర్ ఆర్ ఆర్, కోలీవుడ్ నుంచి వచ్చిన విక్రమ్ ఏ రేంజ్ లో వసూళ్లను కొల్లగొట్టాయో తెల్సిందే. అందుకే విక్రమ్ డైరెక్టర్ లోకేష్‌ కనకరాజ్‌ తన తదుపరి సినిమాలోనూ ఇదే ట్రెండ్ కంటిన్యూ చేయాలనుకంటున్నాడట. కొత్త సినిమాలో విజయ్ కు పోటీగా మరో హీరోను రంగంలోకి దింపబోతున్నాడట.

లోకేష్‌ సినిమాల్లో ఇద్దరు హీరోలు అనేది కామన్‌ అయిపోయింది. మాస్టర్ లో  విజయ్ హీరోగా నటిస్తే, విజయ్‌సేతుపతి విలన్ రోల్ చేశాడు. విక్రమ్ లో కమల్ హీరో, మళ్లీ విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించాడు.ఇప్పుడు విజయ్ నటించే కొత్త చిత్రంలో కూడా స్టార్‌ హీరో ధనుష్‌ని విలన్‌గా చూపించబోతున్నాడట. ఇప్పటికే ధనుష్‌కు కథ వినిపించాడట. ఆయనకు పాత్ర బాగా నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే త్వరలోనే వెండితెరపై ‘మాస్టర్’ వర్సెస్ ‘మారి’ ఫైట్ చూడొచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement