డేట్‌ చేంజ్‌ | Sakshi
Sakshi News home page

డేట్‌ చేంజ్‌

Published Tue, Jun 11 2024 12:07 AM

Dhanush 50th film Raayan to hit the screens on July 26

ధనుష్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్ ’. ఈ మూవీ కాస్త ఆలస్యంగా థియేటర్స్‌లోకి రానుంది. సందీప్‌ కిషన్, కాళిదాస్‌ జయరామ్, ఎస్‌జే సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, దుషార విజయన్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించిన ఈ సినిమాను సన్‌పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది.

నార్త్‌ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాను తొలుత జూన్  13న విడుదల చేయాలనుకున్నారు. కానీ జూలై 26న రిలీజ్‌ చేయనున్నట్లుగా ధనుష్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. ధనుష్‌ కెరీర్‌లో 50వ సినిమాగా రూపొందిన ‘రాయన్‌’ కి ఏఆర్‌ రెహమాన్  సంగీతం అందించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement