David Warner Daughters Dance To Pushpa Movie Saami Saami Song: నవ్వాపుకోలేకపోయిన బన్నీ! - Sakshi
Sakshi News home page

Saami Saami Song: సామీ సామీ సాంగ్‌కు వార్నర్‌ కూతుళ్ల చిందులు

Jan 24 2022 9:18 AM | Updated on Jan 24 2022 9:51 AM

David Warner Daughters Dance on Saami Saami Song - Sakshi

వార్నర్‌ కూతుళ్లు నా సామీ అంటూ డ్యాన్స్‌ చేశారు. 'అమ్మానాన్నల కంటే ముందే పిల్లలు సామీ సామీ పాటకు డ్యాన్స్‌ చేయాలనుకున్నారు' అంటూ..

ఈ మధ్య మ్యూజిక్‌ లవర్స్‌ తెగ వింటున్న సాంగ్స్‌లో 'సామీ సామీ..' సాంగ్‌ది అగ్రస్థానం.. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌, విదేశాల్లో సైతం జనాలు ఈ పాటకు అడిక్ట్‌ అయిపోయి ఎక్కడపడితే అక్కడ చిందులేస్తూ వీడియోలు చేస్తున్నారు. సెలబ్రిటీలు, సామాన్యులు అన్న తేడా లేకుండా అందరూ నా సామీ అంటూ రష్మికను మించిపోయేలా స్టెప్పులేస్తున్నారు.

తాజాగా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ కూతుళ్లు కూడా నా సామీ అంటూ డ్యాన్స్‌ చేశారు. 'అమ్మానాన్నల కంటే ముందే పిల్లలు సామీ సామీ పాటకు డ్యాన్స్‌ చేయాలనుకున్నారు' అంటూ ఈ వీడియోను వార్నర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఇది చూసిన బన్నీ సో క్యూట్‌ అంటూ నవ్వాపుకోలేకపోతున్న ఎమోజీని జత చేశాడు. ఇక ఇటీవల వార్నర్‌ కూడా పుష్పరాజ్‌గా మారిపోయి ఏయ్‌ బిడ్డా.. ఇది నా అడ్డా, శ్రీవల్లి పాటలకు స్టెప్పులేసిన విషయం తెలిసిందే!

Advertisement
 
Advertisement
Advertisement