థ్రిల్లర్‌ దర్శిని  | Sakshi
Sakshi News home page

థ్రిల్లర్‌ దర్శిని 

Published Sun, Mar 10 2024 3:35 AM

Darshini Telugu Movie Poster launched by MVV - Sakshi

వికాస్‌ జీకే, శాంతి జంటగా డా. ప్రదీప్‌ అల్లు దర్శకత్వం వహించిన చిత్రం ‘దర్శిని’. డా. ఎల్‌వీ సూర్యం నిర్మించారు. ఈ సినిమా పోస్టర్‌ని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (విశాఖపట్నం) రిలీజ్‌ చేసి, మాట్లాడుతూ– ‘‘సైన్స్‌ ఫిక్షన్‌గా రూపొందిన చిత్రం ‘దర్శిని’. ఈ సినిమా టీజర్, సాంగ్స్‌ చూశాను.. విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి.

థ్రిల్లర్‌ జానర్‌ మూవీస్‌ని ఇష్టపడే ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘సరికొత్త కథనంతో తెరకెక్కిన చిత్రం ‘దర్శిని’. సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చింది’’ అన్నారు డా. ప్రదీప్‌ అల్లు. ‘‘మా సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు డా. ఎల్‌వీ సూర్యం.

Advertisement
 
Advertisement