రోడ్డు ప్రమాదం: డ్యాన్స్‌ షో కంటెస్టెంట్‌కు తీవ్ర గాయాలు

Dance India Dance Biki Das Injured In Bike Accident Who Works As Food Delivery Boy In Kolkata - Sakshi

కోల్‌కతా:  'డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌' నాల్గో సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్‌ బికీ దాస్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. శుక్రవారం అతడు బైక్‌ మీద వెళుతున్న క్రమంలో మరో బైక్‌ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పక్కటెముకలు విరిగి తీవ్ర గాయాలపాలైన అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటన మీద బికి దాస్‌ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఇదిలా వుంటే బికి దాస్‌ 2014లో ప్రసారమైన 'డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌' నాల్గో సీజన్‌లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించాడు. తన ఎనర్జీతో, హుషారెత్తించే స్టెప్పులతో ప్రేక్షకుల మనసు దోచుకున్న అతడు షోలో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచాడు. కానీ ఈ షో ద్వారా అతడు పెద్దగా లాభపడిందేమీ లేదు. పొట్టకూటి కోసం పలు ఈవెంట్లకు డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లు చేసిన అతడికి లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి లేకుండా పోయింది. దీంతో గత పది రోజులుగా అతడు కోల్‌కతాలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడంతో నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: బెస్ట్‌ ఫ్రెండ్‌ను పెళ్లాడిన బాలీవుడ్‌ నటి
5జీ టెక్నాలజీ: జూహీచావ్లాకు షాక్‌.. 20లక్షల జరిమానా

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top