పండగకి అంకుల్స్‌ సందడి | Crazy Uncles Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

పండగకి అంకుల్స్‌ సందడి

Dec 27 2020 12:37 AM | Updated on Dec 27 2020 12:37 AM

Crazy Uncles Movie Trailer Launch - Sakshi

శ్రీనివాస్, రాజా రవీంద్ర, శ్రీవాస్, గాయత్రీ భార్గవి, సత్తిబాబు

‘ఈ సంక్రాంతికి సినిమా సందడి మొదలవుతోంది. వినోదం పుష్కలంగా ఉన్న ఈ ‘క్రేజీ అంకుల్స్‌’ బాగా సందడి చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత అచ్చిరెడ్డి. శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్‌’. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్‌ సినిమా గ్రూప్, గ్రీన్‌ మెట్రో మూవీస్, శ్రీవాస్‌ 2 క్రియేటివ్స్‌ బ్యానర్స్‌పై గుడ్‌ ఫ్రెండ్స్‌–బొడ్డు అశోక్‌  నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని నిర్మాతలు అచ్చిరెడ్డి, యంఎల్‌ కుమార్‌ చౌదరి, బెల్లంకొండ సురేశ్‌ విడుదల చేశారు.

‘‘క్రేజీ అంకుల్స్‌ ట్రైలర్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఈ చిత్రంతో డబ్బులు బాగా వచ్చి మరిన్ని మంచి సినిమాలు తీయాలని మా శ్రీనుని ఆశీర్వదిస్తున్నా’’ అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేశ్‌. ఇ. సత్తిబాబు మాట్లాడతూ– ‘‘ఇదొక కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. సినిమా చేస్తున్నప్పుడు మా టీమ్‌ ఎంత ఎంజాయ్‌ చేశామో చూస్తున్నపుడు ఆడియన్స్‌ అంతే ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు. ‘‘శ్రేయాస్‌ శ్రీను, నేను ఒక సినిమా చేయాలనుకుంటున్న సమయంలో డార్లింగ్‌ స్వామి చెప్పిన పాయింట్‌ నచ్చి ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు శ్రీవాస్‌. సంగీత దర్శకుడు రఘు కుంచె, నటుడు రాజా రవీంద్ర మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement