Court New Order On Meera Mithun Controversy Issue - Sakshi
Sakshi News home page

Meera Mithun: టచ్‌ చేస్తే కత్తితో పొడుచుకుంటా.. హీరోయిన్‌పై అరెస్ట్‌ వారెంట్‌

Mar 24 2022 8:42 PM | Updated on Mar 25 2022 8:38 AM

Court New Order On Meera Mithun Controversy Issue - Sakshi

Court New Order On Meera Mithun Controversy Issue: ప్రముఖ నటి, బిగ్‌బాస్‌ ఫేం మీరా మీథున్‌ను మళ్లీ వార్తల్లో నిలిచింది. సోషల్‌ మీడియాలో ఏది అనిపిస్తే అది మాట్లాడి వివాదాల పాలవుతుంది ఈ అమ్మడు. ఈ భామపై అప్పట్లో అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. పలు తమిళ చిత్రాల్లో నటించిన మీరాకు అవకాశాలు రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని, అందులో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్లు కూడా ఉన్నారని ఆమె ఆరోపించింది. వారిని వెంటనే ఇండస్ట్రీ నుంచి తప్పించాలంటూ వారిని, వారి కులాన్ని కించపరుస్తూ గతంలో కాంట్రవర్సీ కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వీడియో వైరల్‌ కాగా ఆ సామాజిక వర్గం నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సీ, ఎస్ట్రీ అట్రాసిటీ కేసుతోపాటు పలు కేసులు నమోదయ్యాయి. 

ఆ తర్వాత మీరాను అరెస్ట్‌ చేయడానికి వెళ్లిన పోలీసులకు చుక్కలు చూపించింది ఈ అమ్మడు. అరెస్ట్‌ చేయడానికి వెళ్లిన పోలీసులతో 'ఇక్కడ ఆడవాళ్లకు రక్షణ లేదా? పోలీసులు టార్చర్‌ చేస్తున్నారు.. ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్పందించండి’ అంటూ అరుస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అంతేగాక ప్రతి ఒక్కరూ, పోలీసులు నన్ను టార్గెట్ చేస్తున్నారు. నన్ను టచ్ చేస్తే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బెదిరించింది. ముఖ్యమంత్రి, ప్రధాని మోదీ.. ఇది తమిళనాడు పోలీసులు చేస్తున్న హింస అంటూ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. 

ఇదంతా ఇలా ఉంటే చాలా రోజుల తర్వాత ఈ కేసుపై చెన్నై కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటివరకూ మీరా ఒక్క విచారణకు కూడా హాజరు కాకపోవడంతో ఆమెను అరెస్ట్‌ చేసి ఏప్రిల్‌ 4న కోర్టులో హాజరు పర్చాల్సిందిగా పోలీసులకు ఆదేశించింది. ఇప్పటిదాకా ఇంతలా రచ్చ చేసిన ఈ అమ్మడు ఈసారి ఏం చేస్తుందో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement