అమ్మాయిలతో జాగ్రత్త.. యూత్‌కు హీరోయిన్‌ సలహా | Actress Poonam Bajwa Comments on Girls | Sakshi
Sakshi News home page

అమ్మాయిలతో జాగ్రత్త.. యూత్‌కు హీరోయిన్‌ సలహా

Mar 20 2026 6:55 AM | Updated on Mar 20 2026 8:41 AM

Actress Poonam Bajwa Comments on Girls

నటి పూనం బాజ్వాను అంత సులభంగా ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే ప్రస్తుతం చిత్రాల్లో నటించకపోయినా సోషల్‌ మీడియాలో ఈమె తరచూ  హల్‌చల్‌ చేస్తూనే ఉంటారు. పలు భాషల్లో కథానాయకిగా నటించిన బ్యూటీ తెలుగులో మెదటి సినిమా (2005)లో ఎంట్రీ ఇచ్చింది. అయితే, పరుగు, బాస్‌ సినిమాలతో పాపులర్‌ అయింది. తమిళంలో తేనావట్టు , కచేరి ఆరంభం, సేవల్‌ , తంబికోట్టై  వంటి పలు చిత్రాలు నటించింది. అయితే  స్క్రీన్‌ ప్లే  అందాల ఆరబోతలో  హద్దులు చెరీపేస్తూ కొన్ని ఐటమ్‌ సాంగ్స్‌ లో నటించిన ఈ అమ్మడు కథానాయకిగా ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయారనే చెప్పాలి. 

అయితే ఇంటర్నెట్‌లో గ్లామరస్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ యువత దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న ఈమె ఇన్‌ స్ట్రాగామ్‌లో దాదాపు 40 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉండటం విశేషం. కాగా ఇటీవల తన సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా  నటి పూనం బాజ్వా(Poonam Bajwa) పేర్కొంటూ మీకు స్నేహితురాలుగానో, ప్రేయసి గానో, భార్యగానో  కలిసి ప్రయాణించే యువతి ఏ దేశానికి మహారాణి కాక పోవచ్చుగాక, అయినా ఆమెను  రాణి మాదిరిగానే  భావించాలన్నారు. ఆమె అందాన్ని, ప్రేమను, శక్తిని అభినందించాలన్నారు. 

అంతేకాకుండా అన్ని మర్చిపోదాం అని చెప్పే యువత మరింత జాగురూకత వహించాలన్నారు. ఎందుకంటే మహిళలు ఏ విషయాన్ని మర్చిపోరని ముఖ్యంగా మీ జీవితంలోకి వచ్చే ఇతర అమ్మాయిలకు సంబంధించిన విషయాలను మర్చిపోరన్నారు. కాబట్టి అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలని నటి పూనం బాజ్వా పేర్కొన్నారు. ఇవే పేర్కొన్న విషయాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.   

Advertisement
 
Advertisement
Advertisement