బాలీవుడ్‌ నటి కంగనాపై కాపీరైట్‌ కేసు

Copyright Case On Bollywood Actress Kangana Ranaut - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌పై కాపీరైట్‌ కేసు నమోదు చేయాలంటూ ముంబైలోని ఓ కోర్టు పోలీసులను శుక్రవారం ఆదేశించింది. ‘దిద్దా: వారియర్‌ క్వీన్‌ ఆఫ్‌ కశ్మీర్‌’ అనే పుస్తక రచయిత ఆశిష్‌ కౌల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దిద్దా కథకు సంబంధించి తనకు పూర్తి హక్కులు ఉ​న్నాయని చెప్పారు.

అలాంటి కథను సామాజిక కార్యకర్తగా మారిన ఓ నటి గ్రంథ చౌర్యం చేయడం ఏమైనా సమంసంగా ఉందా? అంటూ కంగనాను ఆశిష్‌ ప్రశ్నించారు. ఈ పుస్తకం హిందీలోకి కూడా అనువాదమైంది. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే పనిలో ఉ‍న్నారు.

సినిమాల విషయనికి వస్తే.. తమిళనాడు దివంగత సీఎం జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. తన తదుపరి చిత్రంలో కంగనా భారత తొలి మహిళ ప్రధాన మంత్రి, ఉక్కు మహిళగా(ఐరన్‌ లేడీ) పేరొందిన ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు.
చదవండి: జాతిపితపై కంగనా సంచలన వ్యాఖ్యలు
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top