
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మోస్ట్ అవైటేడ్ చిత్రం కూలీ. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్నఈ మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. కొద్ది నిమిషాలకే హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ఇండియాతో పాటు ఓవర్సీస్లోనూ రికార్డ్ స్థాయిలో టికెట్స్ బుక్కైపోతున్నాయి.
ఇక తమిళనాడులో ఏకంగా రికార్డ్ ధరకు టికెట్స్ విక్రయిస్తున్నారు. కూలీ మూవీ క్రేజ్ను కొందరు దళారులు క్యాష్ చేసుకుంటున్నారు. చెన్నైలో కూలీ టిక్కెట్స్ను బ్లాక్లో ఏకంగా రూ.4500లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ డే ఫస్ట్ షోలకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఎంత రేటుకైనా అభిమానులు ఎగబడి కొనేస్తున్నట్లు టాక్. పొల్లాచ్చిలో ఓ థియేటర్ సిబ్బంది మొదటి షో టికెట్లను రూ.400కు అమ్ముతున్నట్లు తెలిసింది.
టికెట్ రేట్లపై రజినీకాంత్ వీరాభిమాని ప్రభాకర్ మాట్లాడుతూ.. "చెన్నైలోని అన్ని ప్రముఖ థియేటర్లలో నేను నా అదృష్టాన్ని పరీక్షించుకున్నా. టికెట్స్ రూ.600, రూ.1,000ల నుంచి అత్యధికంగా రూ.4,500 వరకు అమ్ముతున్నారు. మొదటి షో కోసం టిక్కెట్ల యాప్‌ల ద్వారా బుక్ చేసుకోలేకపోతున్నా. ఎందుకంటే ఆ టికెట్స్ అన్నీ బ్లాక్ చేశారు. నాలాంటి అభిమానులకు టిక్కెట్లను బ్లాక్‌లో కొనడం కష్టం. మొదటి షోలు ముగిసే వరకు వేచి ఉండటం తప్ప వేరే మార్గం లేదు." అని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే కేవలం తమిళనాడులోనే కాదు.. 'కూలీ' డబ్బింగ్ వర్షన్‌లకు కూడా టిక్కెట్ల ధరలు బాగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తమిళంతో పాటు తెలుగులో విడుదలవుతోంది. రెండు రాష్ట్రాలు తెల్లవారుజామున షోలను అనుమతివ్వడంతో టికెట్ ధరలు భారీగానే పెంచేశారు. ఇక బెంగళూరులో సింగిల్ స్క్రీన్లలో దాదాపు ఒక్కో టికెట్ రూ. 2,000 వరకు అమ్ముడవుతున్నాయి. బెంగళూరులో టిక్కెట్ల ధర మల్టీప్లెక్స్‌ల్లో ఒక్కో టికెట్ రూ. 500 పైగానే ఉన్నాయి. ముంబయి థియేటర్లలో 'కూలీ' టికెట్ ధరలు రూ. 250 నుంచి రూ. 500 మధ్య ఉన్నాయి. అడ్వాన్స్ బుకింక్స్ చూస్తుంటే ఈ సినిమా మొదటి రోజే రూ. 150 కోట్లు దాటే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
#COOLIE FDFS Ticket Price in Rohini Theater in chennai - ₹4500 😳
Reason - Helicopter 🚁 Flowers Flow Celebration 🥳🎉 1st Time in Kollywood.....@rajinikanth pic.twitter.com/ANSnGLZ4LP— Pravin james (@PravinKuma32774) August 10, 2025