నన్ను కామెడియన్‌గా మాత్రమే చూడలేదు..: బ్రహ్మానందం భావోద్వేగం | Comedian Brahmanandam Emotional Request to His Fans For Telangana Devudu Movie | Sakshi
Sakshi News home page

Brahmanandam: నన్ను కామెడియన్‌గా మాత్రమే చూడలేదు: బ్రహ్మానందం ఏమోషనల్‌

Nov 11 2021 9:16 PM | Updated on Nov 11 2021 9:25 PM

Comedian Brahmanandam Emotional Request to His Fans For Telangana Devudu Movie - Sakshi

Bahmanandam Emotional Request To His Fans: ‘హాస్య బ్రహ్మా’, ప్రముఖ నటుడు బ్రహ్మానందం ఓ వీడియో పంచుకున్నారు. ఆయన నటించిన ‘తెలంగాణ దేవుడు’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఆయన ఓ సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు బ్రహ్మానందం మాట్లాడుతూ..  తెలంగాణ దేవుడు ఓ సందేశాత్మక చిత్రమన్నారు. రేపు సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందానికి ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాకు శ్రీకాంత్, సంగీతలు వారి నటనతో ప్రాణం పోశారని బ్రహ్మానందం కొనియాడారు.

చదవండి: బ్రహ్మానందంకు నితిన్‌ షాక్‌, ఆ మూవీ నుంచి బ్రహ్మీ తొలగింపు!

డైరెక్టర్ హరీశ్ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సినిమాను తెరకెక్కించారని, సమర్థవంతమైన దర్శకుడని ప్రశంసించారు. తన పాత్ర కూడా సినిమాలో చాలా బాగుంటుందన్నారు. తనను కేవలం కామెడీగా మాత్రమే చూడకుండా... హీరో గురువైన మృత్యుంజయ శర్మ పాత్రను తనకిచ్చారని అన్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైందన్నారు. కొంచెం జాప్యం జరిగినా దర్శకుడు సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడని కొనియాడారు. కాగా, ఈ సినిమాను జీషన్ ఉస్మానీ నిర్మించగా.. నందన్ బొబ్బిలి స్వరాలు సమకూర్చారు.

చదవండి: పెళ్లి ఎప్పుడో చెప్పిన విష్ణు ప్రియ, ఆలోపే మింగిల్‌ అవుతానన్నా యాంకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement