Actor-Comedian Ali Helps Daily Food Essentials To Telugu Industry Production Ladies - Sakshi
Sakshi News home page

భార్యతో కలిసి నిత్యావసరాలు పంపిణీ చేసిన అలీ

May 24 2021 7:18 PM | Updated on May 24 2021 7:58 PM

Comedian Ali Distribute Groceries To Telugu Industry Production Ladies - Sakshi

లాక్‌డౌన్‌ కారణంగా షూటింగులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కమెడియన్‌, నటుడు అలీ వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తన భార్య జుబేదాతో కలిసి ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్‌కు చెందిన 130 మంది మహిళా కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. పదికిలోల బియ్యం, నూనె, గోధుమపిండి, చక్కెర సహా 8 రకాలైన సరుకులను వారికి అందజేశారు.

ఈ సందర్బంగా అలీ మాట్లాడుతూ..ప్రతి రోజు ఈ మహిళా కార్మికులు మా కంటే ముందే షూటింగ్ స్పాట్కు వెళ్లిపోయి విధులు నిర్వర్తిస్తుంటారు.  ప్లేట్లు, కాఫీ కప్పులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటారు. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగులు లేక పని దొరక్క వారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని తెలుసు. అందుకే నా వంతుగా చిన్న సహాయం చేస్తున్నాను అని పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో అలీ సోదరుడు, నటుడు ఖయ్యూం సహా తదితరులు పాల్గొన్నారు. 

చదవండి : బ్రదర్స్‌ డే : అరుదైన ఫోటోను షేర్‌ చేసిన చిరంజీవి
వాళ్లు నాకు ఎప్పటికీ ఫోన్‌ చేయరు: సోనూసూద్‌ భావోద్వేగం

Advertisement
 
Advertisement
Advertisement