నవ్వులు పూయిస్తున్న ‘సినిమా బండి’ ట్రైలర్‌

Cinema Bandi Trailer Out Now: Full Of Laughter And Innocence - Sakshi

ప్రవీణ్‌ కంద్రెగుల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సినిమా బండి’. బాలీవుడ్‌ దర్శకద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో ఒక ఆటో డ్రైవర్ కు తన ఆటో లో ఒక ఖరీదైన కెమెరా దొరుకుతుంది. దానితో సినిమా తీయాలనుకుంటాడు. అతని స్నేహితులతో కలిసి సినిమా ప్రయత్నాలు మొదలుపెడతారు.

నిజానికి వాళ్లలో ఎవరికీ సినిమా ఎలా తీయాలనేదానిపై అవగాహన లేదు. ఆ అమాయకులు సినిమా తీయడానికి చేసిన ప్రయోగాలు ఎలా ఉంటాయానేదే ఈ సినిమాలో చూపించబోతున్నారని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ లో నటీనటులు సినిమా తీసే క్రమంలో వచ్చే సన్నివేశాలు, కామెడీ, డైలాగులు నవ్వులు పూయిస్తున్నాయి. ఈ 'సినిమా బండి' మే 14 న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top