Brahmastra Movie: బ్రహ్మాస్త్ర కోసం చిరంజీవి వాయిస్ ఓవర్

బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా తొలిసారి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. తెలుగులో బ్రహ్మాస్త్రంగా రిలీజ్ కానుంది. యే జవానీ హై దీవానీ తెరకెక్కించిన అయాన్ ముఖర్జీ సరిగ్గా పదేళ్ల తర్వాత ఈ మూవీని రూపొందించాడు. ఇటీవలే టీజర్‌తో పాటు నటీనటుల లుక్స్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా ఓ స్పెషల్ వీడియో వదిలింది. ఇందులో చిరంజీవి బ్రహ్మాస్త్రం సినిమా ట్రైలర్‌కు వాయిస్ అందించాడు. ఆ బ్రహ్మాస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖల్లో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే తెలియదు. అతడే శివ.. అంటూ హీరో గురించి పరిచయం చేశాడు. మరి ట్రైలర్ చూడాలంటే మాత్రం జూన్ 15 వరకు ఆగాల్సిందే!
ఈ చిత్రంలో ప్రొఫెసర్ అరవింద్ చతుర్వేది పాత్రను అమితాబ్ బచ్చన్ పోషిస్తుండగా.. అనీష్ శెట్టి పాత్రలో నాగార్జున కనిపించనున్నాడు. మౌనీ రాయ్ దమయంతి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఇదిలా ఉంటే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి, రణ్‌బీర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇటీవల వైజాగ్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే!
Happy to announce that @KChiruTweets garu has lent his voice to Brahmāstra Trailer.
Telugu Trailer of Brahmāstra will release on June 15th!https://t.co/Rl70nZkaMR
— rajamouli ss (@ssrajamouli) June 13, 2022
చదవండి: ఈ సినిమాలో నేను హీరోయిన్ కాదు, కమెడియన్: రాశీ ఖన్నా