Alia Bhatt Baby Bump Photos With Ranbir Kapoor, Viral On Social Media - Sakshi
Sakshi News home page

Alia Bhatt: భర్తతో కలిసి ఆలియా బేబీ బంప్‌ స్టిల్స్‌.. ఫోటోలు వైరల్‌

Aug 6 2022 3:52 PM | Updated on Aug 6 2022 9:14 PM

Alia Bhatt Finally Shows Her Baby Bump As She Poses With Ranbir Kapoor - Sakshi

బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ ఆలియా భట్‌- రణ్‌బీర్‌ ‍కపూర్‌ ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్‌గానే ఆలియా తన ప్రెగ్నెన్సీ న్యూస్‌ను షేర్‌  చేసుకుంది. అయితే గర్బం దాల్చినా షూటింగ్స్‌కి ఏమాత్రం బ్రేక్‌ ఇవ్వకుండా సినిమాలు, ప్రమోషన్స్‌లో పాల్గొంటుందీ బ్యూటీ. తాజాగా రణ్‌బీర్‌-ఆలియా జంటగా బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు.

ఓ సాంగ్‌ ప్రివ్యూ లాంచ్‌ కోసం ఈ ఇద్దరూ సందడి చేశారు. అయితే భర్తతో కనిపించిన ఆలియా భట్‌ తొలిసారిగా తన బేబీ బంప్‌ కనిపించేలా డ్రెస్‌ చేసుకుంది. ఇంతకుముందు డార్లింగ్‌ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆలియా బేబీ బంప్‌ కనపడకుండా ఉండేందుకు వదులుగా ఉండే దుస్తులు వేసుకునేది. కానీ ఈసారి మాత్రం బేబీ బంప్‌ను హైలైట్‌ చేస్తూ దుస్తులు ధరించింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోట్‌ అవుతున్న ఈ జంటకి నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా బ్రహ్మస్త్ర సినిమా సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమితాబ్ బచ్చన్‌, అక్కినేని నాగార్జున ఇందులో కీలక పాత్రల్లో నటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement