Waltair Veerayya: కర్ణాటకలో మెగాస్టార్‌ మాస్‌ క్రేజ్‌ చూశారా? బ్యాండ్‌ బాజాలతో ఫ్యాన్స్‌ రచ్చ

Chiranjeevi Karnataka Fans Huge Rally Over Waltair Veerayya Release - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో అయితే ఆయన పేరు ఓ బ్రాండ్‌గా నిలిచిపోయింది. అనీర్వచమైన తన నటనతో ఎన్నో రికార్డులు కొల్లగోట్టారు చిరు. ఇక ఆయన సినిమా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరం తలపిస్తుంది. ఇక పండక్కి ఆయన సినిమా అంటే ఇక ఫ్యాన్స్‌ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలా థియేటర్లో సందడి చేసేందుకు ఈ సంక్రాంతికి(జనవరి 13న) వాల్తేరు వీరయ్యతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.

చదవండి: Waltair Veerayya Review: ‘వాల్తేరు వీరయ్య’ మూవీ రివ్యూ

ఆయన 154వ చిత్రంగా బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్, కామెడీతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ల వద్ద మాస్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే చిరుకు ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో నేడు వాల్తేరు వీరయ్య రిలీజ్‌ సందర్భంగా కార్ణాటకలోని ఆయన అభిమానులు చేసిన హంగామా మామూలుగా లేదు. ఈ చిత్రంలోని చిరు 154 పోస్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

చదవండి: శృతి ఆరోగ్యంపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

ఆయన 154 పోస్టర్లను 154 ఆటోలపై పెట్టి కర్ణాటక రోడ్లపై బ్యాండ్‌లు మోగిస్తూ.. డాన్స్‌ చేస్తూ జాతరగా భారీ ర్యాలీ నిర్వహించి చిరుపై అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసి మెగా ఫ్యాన్స్‌ అంతా మురిసిపోతూ ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా వాల్తేరు వీరయ్యలో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించగా.. మాస్‌ మహారాజా రవితేజ కీ రోల్‌ పోషించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top