Ari: మంగ్లీ ఆలపించిన ‘చిన్నారి కిట్టయ్య’ పాట విన్నారా? | Chinnari Kittayya Song Out From Jayashankar Ari Movie | Sakshi
Sakshi News home page

Ari: మంగ్లీ నోట ‘చిన్నారి కిట్టయ్య’ పాట.. అనూప్ సంగీతం అద్భుతం!

Mar 5 2023 11:19 AM | Updated on Mar 5 2023 11:31 AM

Chinnari Kittayya Song Out From Jayashankar Ari Movie - Sakshi

పేప‌ర్ బాయ్‌` ఫేమ్‌ జయశంకర్‌ తెరకెక్కిస్తున్న రెండో చిత్రం ‘అరి’. మై నేమ్ ఈజ్ నోబడీ అనేది ట్యాగ్ లైన్. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌లు శేషు మారం రెడ్డి, శ్రీ‌నివాస్ రామిరెడ్డి సంయుక్తంగా, ఆర్వి రెడ్డి, సమర్పణ లో `అరి` సినిమా ని నిర్మిస్తున్నారు.  అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, సాయికుమార్‌, వైవాహ‌ర్ష‌, శుభ‌లేఖ సుధాక‌ర్ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట విడుదలైంది.  కృష్ణుడు గొప్పదనం గురించి తెలియజేసే ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్‌ అందించగా.. ప్రముఖ గాయని మంగ్లీ అద్భుతంగా ఆలపించింది. అనూప్‌ రూబెన్స్‌ మైమరిపించే సంగీతం అందించారు. 

ఇక అరి విషయానికొస్తే.. జయశంకర్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది.  ఈ చిత్రంలో  జెలసీ పాత్రలో అనసూయ, ప్రైడ్‌గా సాయి కుమార్, ఆంగర్ క్యారెక్టర్‌లో శ్రీకాంత్ అయ్యంగార్, లస్ట్‌గా వైవా హర్ష, గ్రీడీ పాత్రలో శుభలేఖ సుధాకర్, అటాచ్ మెంట్ క్యారెక్టర్‌లో సురభి ప్రభావతి నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి విడుదలకు రెడీ అయిన ఈ చిత్రానికి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ నుంచి భారీ ఆఫర్‌ వచ్చిందట. థియేటర్స్‌లో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ చేయడానికి రూ.10 కోట్లతో డీల్‌ సెట్‌ అయినట్లు తెలుస్తోంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ కావడంతో ‘అరి’ ని కచ్చితంగా ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో నెట్‌ఫ్లిక్స్‌ భారీ మొత్తం చెల్లించడానికి సిద్దమైందట. అయితే చిత్రబృందం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. థియేటర్స్‌లో విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement