కొన్ని దుష్టశక్తులు నాపై కుట్ర: సింగర్ మంగ్లీ మరో పోస్ట్ | Singer Mangli Post On Micro Finance Scam Allegations | Sakshi
Sakshi News home page

Singer Mangli: కొన్ని దుష్టశక్తులు నాపై కుట్ర: సింగర్ మంగ్లీ మరో పోస్ట్

Apr 23 2026 2:34 PM | Updated on Apr 23 2026 2:40 PM

Singer Mangli Post On Micro Finance Scam Allegations

సింగర్ మంగ్లీ వివాదం ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేసింది. మైక్రో ఫైనాన్స్, శుభక్షేత్ర ఇన్‌ఫ్రా మోసాలతో బాధితులకు అన్యాయం జరిగిందని తెలిపింది. వాళ్లకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నానని వెల్లడించింది. బాధితుల తరఫున అండగా ఉంటానని గతంలో చెప్పానని.. ఇప్పుడు కూడా ఆ మాటకు కట్టుబడి ఉన్నానని పేర్కొంది. ఈ ఆర్థిక మోసాలతో నాకు ఎలాంటి ప్రమేయం లేదని బహిరంగంగా ప్రకటిస్తున్నానని మంగ్లీ తెలిపింది.

కానీ కొందరు వ్యక్తులు, దుష్ట శక్తులు అదే పనిగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారని సింగర్ మంగ్లీ ఆవేదన వ్యక్తం చేసింది. నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజం ఏంటనేది నిలకడపై తెలుస్తుందని.. న్యాయ వ్యవస్థ, చట్టాలపై తనకు పూర్తిగా నమ్మకముందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement