మున్ముందు బ్లడ్‌ దొరకదు.. ఆలోచించండి: చిన్మయి

Chinmayi Sripada Talks On Blood Donation After Covid 19 Vaccination  - Sakshi

చిన్మయి శ్రీపాద పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సింగర్‌ కంటే కూడా ఆమె మీ టూ ఉద్యమంతో బాగా పాపులర్‌ అయ్యారు. ఈ ఉద్యమంలో తన ముక్కుసూటి తీరుతో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక సోషల్‌ మీడియాలో సైతం పలు విషయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అంతేగాక తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్‌ చేస్తూ యాక్టివ్‌ ఉండే ఆమె పలు విషయాలపై నెటిజన్లకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు.

ముఖ్యంగా మహిళల భద్రతపై చర్చిస్తుంటారు. అలా ఎప్పుడు ఆసక్తికర విషయాలను పంచుకునే చిన్మయి తాజాగా ఓ సందేశాన్ని ఇచ్చారు. వ్యాక్సినేషన్‌ తర్వాత రక్తదానం ఇవ్వచ్చా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పష్టతనిస్తూ ఆమె ఓ వీడియోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోన్న సంగతి తెలిసిందే.

చిన్న-పెద్ద, పేద-ధనిక అనే ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా అందరిపై మహమ్మారి తన పంజా విసురుతోంది. ఈ క్రమంలో కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్‌ తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. దీంతో వ్యాక్సినేషన్ తీసుకున్న రక్తాదానం చేయడంపై ఆమె మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌ తీసుకున్న దాదాపు 56 నుంచి 60 రోజుల వరకు బ్లడ్ డొనేట్‌ చేయరాదు. దాని వల్ల మున్ముందు బ్లడ్ బ్యాంకులో రక్తం అందుబాటులో లేకుండా పోతుంది. కాబట్టి యువత ఒకసారి ఆలోచించండి.. వ్యాక్సినేషన్‌కు ముందే బ్లడ్ డొనేట్ చేయండి’ అంటూ ఆమె పిలుపునిచ్చారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top