Cherasala Movie: Cherasala Teaser Launched By SV Krishna Reddy - Sakshi
Sakshi News home page

'చెరసాల' టీజర్ వచ్చేసింది..

Apr 7 2021 5:58 PM | Updated on Apr 7 2021 7:58 PM

Cherasala Teaser Released By SV Krishna Reddy - Sakshi

ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలి ? ఎలా ఉండకూడదు..?

ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలి ? ఎలా ఉండకూడదు ? అనే కథాశంతో  ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమే "చెరసాల". ఎస్ రాయ్ క్రియేషన్స్ పతాకంపై శ్రీజిత్, రామ్ ప్రకాష్ గుణ్ణం, నిష్కల, శిల్పా దాస్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ ప్రకాష్ గుణ్ణం దర్శకత్వం వహిస్తుండగా మద్దినేని సురేష్ సుధారాయ్‌లు నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి "చెరసాల" టీజర్‌ను, ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ట్రైలర్‌ను విడుదల చేశారు. నిర్మాత ఆచంట గోపీనాథ్, బసి రెడ్డిలు "చెరసాల" చిత్రంలోని పాటలను విడుదల చేశారు.

అనంతరం ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. "ఈ చిత్ర టీజర్‌ను నేను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కెమెరామెన్ దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడు. సినిమా మేకింగ్ బాగుంది. నిర్మాతలు దర్శకుడికి ఫ్రీడం ఇవ్వడం వల్ల సినిమా ఇంత బాగా వచ్చింది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించి దర్శక, నిర్మాతలకు మంచిపేరుతో పాటు, డబ్బులు కూడా రావాలని కోరుకుంటున్నా" అన్నారు. తనకు మొదటి సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తెరకెక్కించాడని ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ప్రశంసించారు.

చిత్ర దర్శకుడు రామ్ ప్రకాష్ గుణ్ణం మాట్లాడుతూ.. "చిన్నప్పటినుంచి స్కూల్ కన్నా సినిమాల మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. నాకున్న ఆసక్తిని గమనించి పేరెంట్స్‌ నాకు సపోర్ట్‌గా నిలిచారు. కానీ నేను ఇండస్ట్రీలోకి రావడానికి చాలా ఇబ్బందిపడ్డాను. తర్వాత సినిమాటోగ్రాఫర్‌గా జాయిన్ అయిన నేను గత పది సంవత్సరాలుగా సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తూ.. 24 క్రాఫ్ట్స్ ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకుని ఇండస్ట్రీలో నాకంటూ ఒక చిన్న గుర్తింపు ఉండాలనే తపనతో..ఈ కథ రాసుకోవడం జరిగింది. ఈ కథను ప్రొడ్యూసర్ సురేష్ మాదినేని గారికి స్క్రిప్ట్ చెప్పిన వెంటనే ఇంప్రెస్ అయి వెంటనే షూటింగ్ మొదలు పెట్టమని చెప్పారు. దాంతో ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా చేస్తూ దర్శకుడిగా, నటుడిగా కూడా ఈ చిత్రంలో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అన్నారు తాను లీడ్ రోల్ ప్లే చేసినా, కంటెంటే హీరో అని కథానాయకుడు సుజిత్‌ చెప్పుకొచ్చాడు. తెలుగులో నేను చేస్తున్న మొదటి సినిమా "చెరసాల" అని హీరోయిన్లు‌ నిష్కల, శిల్పాదాస్‌ పేర్కొన్నారు.

చదవండి: సారంగదరియా.. 100 మిలియన్ల వ్యూస్‌!

పోలింగ్‌ బూత్‌లోకి శృతి.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement