Cheddi Gang Tamasha Movie Release Date: సెన్సార్ పూర్తి చేసుకున్న చెడ్డి గ్యాంగ్ తమషా.. రిలీజ్ డేట్ ఫిక్స్

సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాణ సారధ్యంలో అబుజా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం చెడ్డీ గ్యాంగ్ తమాషా. ఈ చిత్రంలో గాయత్రి పటేల్ హీరోయిన్‌గా నటించింది. రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 10న ఈ మూవీని విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా నిర్మాత సిహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. ‘మా చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తిన్నాము.
చదవండి: కాంతార 2పై కీలక అప్‌డేట్ ఇచ్చిన రిషబ్ శెట్టి
సినిమా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలన్ని ఈ మూవీలో ఉన్నాయి. తప్పకుండా చెడ్డి గ్యాంగ్ తమషా ప్రక్షకులను ఆకట్టుకుంటుంది. టైటిల్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, టైటిల్ టిజర్ ను ప్రముఖ నటుడు సునీల్, టీజర్‌ను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ , ట్రైలర్‌ను హాస్య బ్రహ్మ బ్రహ్మానందం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టీజర్ ట్రైలర్‌తో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బిజినెస్ పరంగా కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము. మా తోలి ప్రయత్నంను ఆశీర్వదించండి’ అని అన్నారు.
మరిన్ని వార్తలు :