Rishab Shetty: కాంతార 2పై కీలక అప్‌డేట్‌ ఇచ్చిన రిషబ్‌ శెట్టి

Rishab Shetty Shares Interesting Update About Kantara 2 Movie - Sakshi

గతేడాది రిలీజ్‌ అయిన కన్నడ చిత్రం కాంతార ఎంతటి విజయం సాధించిన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కించిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళు చేసింది.

చదవండి: వచ్చే వారం ప్రభాస్‌-కృతి సనన్‌ నిశ్చితార్థం? ట్వీట్‌ వైరల్‌

విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఆస్కార్‌కు నామినేషన్స్‌ ఎంట్రీలోనూ చోటు సంపాదించుకోవడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు పార్ట్‌ 2 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కానీ ఇది కాంతారకు సీక్వెల్‌ కాదని ఇప్పటికే చిత్ర బృందం స్పష్టం చేసింది. అయితే కాంతార 2 ప్రకటించిన నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. తాజాగా దీనిపై హీరో, డైరెక్టర్‌ రిషబ్‌ శెట్టి కీలక అప్‌డేట్‌ ఇచ్చారు.

చదవండి: ఆయన మరణం తర్వాత నన్ను ఏ సంఘటన కదిలించడం లేదు: సునీత

తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన ఆయన కాంతార 2పై స్పందించారు. ‘వచ్చే ఏడాది కాంతార 2ను విడుదల చేస్తాం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రి ప్రొడక్షన్‌ పనులు స్టార్ట్‌ చేశాం. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. ఇది కాంతారకు సీక్వెల్‌ కాదు.. ప్రీక్వెల్‌. తొలి భాగం కథ ఎక్కడైతే ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను ఇందులో చూపించబోతున్నాం. అలాగే పంజుర్లికి సంబంధించిన సన్నివేశాలు పార్ట్‌ 2లో ఎక్కువగా ఉంటాయి’ అంటూ రిషబ్‌ చెప్పుకొచ్చారు. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top