Prabhas-Kriti Sanon: వచ్చే వారం మాల్దీవుల్లో ప్రభాస్‌-కృతి సనన్‌ నిశ్చితార్థం? సంచలన ట్వీట్‌ వైరల్‌

Bollywood Critic Umair Sandhu Tweet Prabhas And Kriti Sanon Engaged in Maldives - Sakshi

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ‘డార్లింగ్‌’ ప్రభాస్‌. ఆయన పెళ్లి వార్తలు ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్‌టాపికే. ప్రభాస్‌ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడాని ఫ్యాన్స్‌తో పాటు సినీ సెలబ్రెటీలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్‌-అనుష్కలు పెళ్లి చేసుకోవాలనేది తెలుగు అభిమానుల కోరిక. కానీ ప్రభాస్‌-కృతి సనన్‌లు డేటింగ్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా వీటిని ఇప్పటికే ప్రభాస్‌-కృతిలు కొట్టిపారేసినప్పటికీ వీరి డేటింగ్‌ రూమర్స్‌కు మాత్రం చెక్‌ పడటం లేదు. 

చదవండి: కన్నీళ్లు రావడం లేదు.. అంతకంటే చలించే సంఘటన ఇంకేముంటుంది: సునీత

ఇక ఈ పుకార్లకు మరింత బలం చేకూరేలా తాజాగా వీరిద్దరి నిశ్చితార్థమంటూ ఓ ట్వీట్‌ దర్శనం ఇచ్చింది. బాలీవుడ్‌ క్రిటిక్‌ ఉమైర్‌ సంధు చేసిన ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాతో పాటు ఇండస్ట్రలోనూ హాట్‌టాపిక్‌గా మారింది. ‘బ్రేకింగ్ న్యూస్: కృతి సనన్, ప్రభాస్ వచ్చే వారం మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకోబోతున్నారు. ఇది వారిద్దరికీ చాలా సంతోషకరమైనది’ అంటూ అతడు తన ట్వీట్‌ రాసుకొచ్చాడు. దీంతో క్షణాల్లో అతడి ట్వీట్‌ వైరల్‌గా మారింది. కాగా దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం ఆపండి’ అని కొందరు 

‘ఏంటి! ఇది నిజమేనా?’ అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ఉమైర్‌ సంధు బాలీవుడ్‌ సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలపై సంచలన ట్వీట్లు చేస్తూ తరచూ వివాదంలో చిక్కుకుంటుంటాడు. అంతేకాదు అతడిపై పలుమార్లు పోలీస్‌ కేసు కూడా నమోదైంది. ఎప్పటిలాగే ఉమైర్‌ సంధు వ్యాఖ్యలను పలువురు కొట్టి పారేస్తున్నారు. ఇందులో నిజం లేదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో కృతి సనన్‌ రిలేషన్‌పై బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ క్లారిటీ ఇచ్చాడు. కృతి సనన్‌తో కలిసి రీసెంట్‌గా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో వరుణ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

చదవండి: అప్పుడే ఓటీటీకి వారసుడు మూవీ! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌?

ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. కృతి ప్రస్తుతం దీపికా పదుకొనె హీరోయిన్‌గా చేస్తున్న ఓ భారీ మూవీ హీరోతో ప్రేమలో ఉందంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. కాగా దీపికా ప్రస్తుతం ప్రభాస్‌ సరసన ప్రాజెక్ట్‌ కెలో నటిస్తోంది. దీంతో వరుణ్‌ కామెంట్స్‌ ప్రభాస్‌-కృతి డేటింగ్‌ రూమర్స్‌కు ఆజ్యం పోసినట్లయ్యింది. అలాగే రీసెంట్‌గా ప్రసారమైన ప్రభాస్‌-బాలయ్య అన్‌స్టాపబుల్‌ షోలో ప్రభాస్‌ పెళ్లిపై చరణ్‌ హింట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ప్రభాస్‌ నుంచి గుడ్‌ న్యూస్‌ వస్తుందంటూ ఆసక్తికర విషయం చెప్పాడు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ప్రభాస్‌-కృతి  జంటగా నటించని ఆదిపురుష్‌ మూవీ ఈ ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top