Rashmika Mandanna: ‘కోపంతో పుష్ప 2 సెట్‌ వీడిన రష్మిక!’ బన్నీనే కారణమంటూ ట్వీట్‌

Umair Sandhu Tweet Rashmika Mandanna Left Pushp 2 Set For This Reason - Sakshi

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా  పుష్ప 2 షూటింగ్‌తో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ క్రమంలో షూటింగ్‌లో పాల్గొన్న రష్మికకు సెట్‌లో చేదు అనుభవం ఎదురైందట. దీంతో రష్మిక అసహనంతో సెట్‌ నుంచి బయటకు వచ్చిందంటూ ఓ ట్వీట్‌ నెట్టింట సంచలనం రేపుతోంది. అయితే ఈ ట్వీట్‌ చేసింది ఎవరో తెలిసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: ఓ ఇంటివాడైన చై! నాగార్జున ఇంటికి సమీపంలోనే మకాం?

కాగా బాలీవుడ్‌ క్రిటిక్‌ ఉమైర్‌ సంధు గురించి ప్రత్యేకం పరిచయం అక్కర్లేదు. సినిమా రివ్యూలతో పాటు తరచూ నటీనటుల టార్గెట్‌ చేస్తుంటాడు. స్టార్‌ సెలబ్రెటీలే ఫోకస్‌గా వారిపై సంచలన కామెంట్స్‌ చేస్తుంటాడు. తాజాగా ఉమైర్‌ టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ని టార్గెట్‌ చేశాడు. బన్నీ గురించి ఆయన చేసిన ట్వీట్‌ నెట్టింట చర్చనీయాంశమైంది. ‘బ్రేకింగ్‌: నిన్న జరిగిన పుష్ప 2 షూటింగ్‌ సెట్‌ నుంచి రష్మిక కోపంగా వెళ్లిపోయింది. దీనికి కారణం అల్లు అర్జున్‌. సెట్‌లో బన్నీ రష్మికను ఘోరంగా అవమానించాడు.

ఆయన ప్రవర్తనతో ఇబ్బంది పడ్డ ఆమె కాసేపటి తర్వాత అసహనంతో సెట్‌ నుంచి వెళ్లిపోయింది’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఉమైర్‌ సంధుపై బన్నీ ఫ్యాన్స్‌ మండిపడుతుంటే మరికొందరు అతడి కామెంట్స్‌ని కొట్టిపారేస్తున్నారు. ‘ఎప్పుడు ఇలాంటి వార్తలేనా.. విని విని విసుగు వస్తుంది. ఏదైనా కొత్తగా ట్రే చేయ్‌’, ‘అచ్చం ఇలాగే ఇటీవల శ్రీనిధి శెట్టి గురించి.. ఇప్పుడు రష్మికపై తప్పుడు ప్రచారం’, ‘ఏదైనా చెబితే నమ్మేలా ఉండాలి.. నిన్న రష్మిక షూటింగ్‌లో లేదు చెన్నైలో ఉంది’ అంటూ నెటిజన్లు ఉమైర్‌కు చురకలు అంటిస్తున్నారు.

చదవండి: నరేష్‌తో పెళ్లి.. పవిత్ర లోకేష్‌పై మాజీ భర్త సుచేంద్ర సంచలన ఆరోపణలు!

కాగా బన్నీ-రష్మిక సన్నిహత్యం గురించి తెలిసిందే. సెట్‌లోనే కాదు బయట కూడా  వీరిద్దరు మంచి స్నేహితుల్లా ఉంటారు. ఇక బన్నీ క్రమశిక్షణ ఎలాంటిదో చెబుతూ ఇప్పటికీ పలువురు దర్శకులు ఆయనను కొనియాడారు. అల్లు అర్జున్‌కు అంకితాభావంతో పనిచేస్తుంటాడని, స్టార్‌ హీరో అనే గర్వం లేకుండా తన కో-యాక్టర్స్‌తో సరదగా ఉంటాడని డైరెక్టర్‌ సుకుమార్‌తో పాటు ఆయన పని చేసిన పలువురు దర్శకులు ఇంటర్య్వూల్లో వెల్లడించారు. (చదవండి: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ) 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top