ఎస్పీ బాలు కోసం మేమంతా: సెలబ్రిటీలు

Celebrities Pray For singer SP Balasubrahmanyam Speedy Recovery - Sakshi

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్షీణించడంతో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని బాలు కుమారుడు చరణ్ తెలిపారు. అయితే బాలసుబ్రహ్మణ్యంకు ఈనెల 5న కరోనా బారిన పడిన విషయంతెలిసిందే. గత పది రోజులుగా చెన్నై చూలైమేడులోని ఎంజీఎం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు, తాజాగా ఆయన సతీమణి సావిత్రి బాలసుబ్రహ్మణ్యం కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరోవైపు బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులంతా కోరుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా get well soon అంటూ ప్రార్థిస్తున్నారు. (ఐసీయూలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం)

‘ప్రియమైన సోదరుడు ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు. ‘బాలసుబ్రమణ్యం సార్ గురించి వినడానికి చాలా భయంగా ఉంది. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని దుల్కర్ సల్మాన్ అన్నారు. ‘అనారోగ్యం నుంచి కోలుకొని మీ డివైన్‌ వాయిస్‌తో మమ్మల్ని ఆశీర్వదించడానికి తిరిగి వస్తారని మాకు తెలుసు.ఎస్పీబీ కోలుకోవాలని దేవుడిని ప్రార్థించండి’  అని మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ తెలిపారు. వీరితోపాటు ఏఆర్‌ రెహమాన్‌, ఇళయ రాజా, చిత్ర, బోణీ కపూర్‌, భారతీరాజా, కొరటాల శివ, విజయ్‌ ఆంటోని, శేఖర్‌ కపూర్‌, ధనుజ్‌, యువన్‌ శంకర్‌ రాజా‌ వంటి వారంతా బాలు కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top