‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’.. సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవికా సతీషన్ ప్రధాన పాత్రల్లో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’. వేణుమాధవ్ పెద్ది, కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో విశ్వంత్ మాట్లాడుతూ– ‘‘న్యూ ఏజ్ అండ్ ఫన్ కాన్సెప్ట్ ఫిల్మ్ ఇది. సంతోష్ హార్డ్ వర్క్ చేశారు. వేణు, నిరంజన్‌గార్లు పిల్లర్స్‌లా నిలబడ్డారు’’ అన్నారు.
‘‘ఓ కొత్త దర్శకుడికి కావాల్సిన మంచి కథ, మంచి ప్రొడక్షన్ ఈ సినిమాతో నాకు దొరికాయి. విశ్వంత్, నిర్మాతలు ఎంతగానో ప్రోత్సహించారు’’ అన్నారు సంతోష్. ‘‘తెలుగు రాష్ట్రాల్లో 350 థియేటర్స్‌లో, యూఎస్‌లో వంద థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు వేణుమాధవ్.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు