యాక్టర్‌ బోనీ కపూర్‌ | Boney Kapoor to act in a film directed by Luv Ranjan | Sakshi
Sakshi News home page

యాక్టర్‌ బోనీ కపూర్‌

Jan 11 2021 4:01 AM | Updated on Jan 11 2021 4:57 AM

Boney Kapoor to act in a film directed by Luv Ranjan - Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ కొత్త ప్రయాణం ప్రారంభించారు. దాదాపు నలభై ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న బోనీ ఇప్పుడు నటుడిగా మారారు. లవ్‌ రంజన్‌ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ ఓ సినిమా చేస్తున్నారు. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ తండ్రి పాత్రలో కనిపించనున్నారు బోనీ కపూర్‌. ఈ పాత్రకు బోనీ కపూరే సరిగ్గా సరిపోతారని దర్శకుడు భావించి, ఆయన్ను ఒప్పించారట. త్వరలోనే ఈ సినిమా సెట్లో జాయిన్‌ అవుతారు బోనీ. ఇటీవలే అనిల్‌ కపూర్‌ ముఖ్య పాత్రలో వచ్చిన ‘ఏకే వర్సెస్‌ ఏకే’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు బోనీ. ఇప్పుడు రణ్‌బీర్‌ సినిమాలో పూర్తి స్థాయి పాత్రలో కనిపిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement