బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల కన్నూమూసిన దిగ్గజ నటుడు నానా పటేకర్‌ను ఉద్దేశించిన సంచలన వ్యాఖ్యలు చేసింది. తన జీవితాన్ని నరకప్రాయంగా మార్చాడని ఆవేదన వ్యక్తం చేసింది. నా లైఫ్‌లో నానా పటేకర్ ఓ పెద్ద భూతమని ఆరోపించింది. ఇప్పుడు ఆ భూతం చనిపోయిందని.. ఆయన చనిపోయాక ఆన్‌లైన్‌లో తనపై నెగెటివిటీ పెరిగిందని తనుశ్రీ దత్తా వెల్లడించారు. నానా లైంగికంగా వేధించిన విషయాన్ని బయటపెట్టినప్పటి నుంచే లైఫ్ నరకప్రాయంగా మారిపోయిందన్నారు. నానా పటేకర్ మరణించాక తనపై వచ్చిన విద్వేషపూరిత వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించారు. కాగా.. 2018లో మీ టూ ఉద్యమంలో భాగంగా నానా పటేకర్‌పై తనుశ్రీ లైంగిక వేధింపుల కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తగిన సాక్ష్యాలు లేవన్న కారణాలతో ఆ కేసులో నానాకు క్లీన్‌చిట్ లభించింది.
తనుశ్రీ మాట్లాడుతూ..'కొందరు మనుషులు ఇంత మూర్ఖంగా ఉంటారనుకోలేదు. ఓ వ్యక్తితో ప్రపంచానికి ఉన్న అనుభవాలు భిన్నంగా ఉండొచ్చు.. కానీ ఆ వ్యక్తి వల్ల నాకెదురైన చేదు అనుభవాలు ఇవీ. అతడు నన్ను ఒంటరిగా వేధించలేదు, కొందరితోగ్రూపు ఏర్పాటు చేసి మరి హింసించాడు. ఓ వ్యక్తి మరణించినంత మాత్రాన అతడు జీవితంలో చేసిన నేరాలు, వేధింపులన్నీ మాఫీ అవుతాయా? దేవుడు కూడా క్షమించమని అడగనివారిని ఉపేక్షించడు. ముందు చేసిన నేరం అంగీకరించి క్షమాపణ కోరాలి. ఒకరి లైఫ్‌ను సర్వనాశనం చేశామని ఒప్పుకోవాలి. కానీ అలా జరగలేదు. అందుకే ఆయన చనిపోతే ఈవిల్ డెడ్ అని అభివర్ణించా.'అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ బాలీవుడ్‌లో చర్చనీయాశంగా మారాయి.


