ప్రేక్షకుల అభిరుచి మారింది.. అలాంటి చిత్రాలనే ఆదరిస్తారు:విక్కీ కౌశల్‌ | Sakshi
Sakshi News home page

Vicky Kaushal: ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 అందుకే హిట్: విక్కీ కౌశల్

Published Mon, Dec 26 2022 9:12 PM

Bollywood Actor Vicky Kaushal Comments About Films Success - Sakshi

బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్ పరిచయం అక్కర్లేని పేరు.  ఇటీవలే ‘గోవిందా నామ్‌ మేరా అంటూ ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఆ చిత్రం అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విక్కీ కౌశల్‌ ఆ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.  ఇటీవల బాలీవుడ్‌ చిత్రాలు సక్సెస్ కాకపోవడం పట్ల ఆయన స్పందించారు.  
 
విక్కీ కౌశల్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా దర్శకుడు శశాంక్‌ కొవిడ్‌కు ముందు కథ చెప్పారు. ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు వాళ్లని కాస్త నవ్విద్దామనుకున్నా.  కథ వినగానే ఓకే చేశా. ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే ఆడుతున్నాయి. ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. కథ బాగుంటే.. ఏభాషైనా సరే ఆదరిస్తున్నారు. కేజీయఫ్‌2, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలకు మంచి స్పందన వచ్చింది. ' అని అన్నాడు. ఈ ఏడాది విడుదలైన అజయ్‌ దేవగణ్‌ నటించిన ‘దృశ్యం2’ మినహాయిస్తే బాలీవుడ్  సినిమాలు విఫలమైన విషయం తెలిసిందే. 


 

Advertisement
 
Advertisement
 
Advertisement