కిడ్నీ ఫెయిలై కన్నుమూసిన సల్మాన్‌ సహనటుడు | Bollywood Actor Arun Verma Passed Away | Sakshi
Sakshi News home page

Arun Verma: అనారోగ్యంతో బాలీవుడ్‌ నటుడు కన్నుమూత

Jan 21 2022 12:02 PM | Updated on Jan 21 2022 1:15 PM

Bollywood Actor Arun Verma Passed Away - Sakshi

అతడి బ్రెయిన్‌లో కొంతభాగం పని చేయడం ఆగిపోయిందని, తర్వాత శరీరంలోని ఇతర భాగాలు పనిచేయకుండా పోగా ఊపిరితిత్తులు, కిడ్నీ ఫెయిలవడంతో ఆయన ప్రాణాలు విడిచారని చెప్పుకొచ్చాడు

బాలీవుడ్‌ నటుడు అరుణ్‌ వర్మ(62) కన్నుమూశారు. సల్మాన్‌ఖాన్‌తో కలిసి 'కిక్‌', 'ముజే షాదీ కరోగే' చిత్రాల్లో నటించిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భోపాల్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన గురువారం(జనవరి 20న) కిడ్నీ ఫెయిలవడంతో తుది శ్వాస విడిచారు. ఆయన గురువారం ఉదయం 2 గంటల ప్రాంతంలో మరణించారని అరుణ్‌ బంధువు మీడియాకు వెల్లడించాడు.

మొదట అతడి బ్రెయిన్‌లో కొంతభాగం పని చేయడం ఆగిపోయిందని, తర్వాత శరీరంలోని ఇతర భాగాలు పనిచేయకుండా పోగా ఊపిరితిత్తులు, కిడ్నీ ఫెయిలవడంతో ఆయన ప్రాణాలు విడిచారని చెప్పుకొచ్చాడు. కాగా అరుణ్‌ వర్మ సన్నీడియోల్‌ నటించిన 'డాకిట్‌' సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టారు. నాయక్‌, ప్రేమ గ్రంథ్‌, కల్నాయక్‌, హీరోపంతి వంటి పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. సల్మాన్‌ ఖాన్‌, టైగర్‌ ష్రాఫ్‌, రిషి కపూర్‌ వంటి బడా హీరోల పక్కన నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement